: ‘టీ న్యూస్’కు నోటీసుల ఎఫెక్ట్...సచివాలయంలో ఏపీ సీఎం బ్లాకు వద్ద భద్రత పెంపు


ఆడియో టేపుల ప్రసారాలకు సంబంధించి తెలంగాణ న్యూస్ ఛానెల్ ‘టీ న్యూస్’కు ఏపీ పోలీసుల నోటీసుల నేపథ్యంలో సచివాలయంలో భద్రత మరింత కట్టుదిట్టమైంది. ప్రధానంగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కార్యాలయం ఉన్న ఎల్ బ్లాకు వద్ద మూడంచెల భద్రత ఏర్పాటైంది. పెద్ద సంఖ్యలో బారీకేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు, ప్రవేశాలపైనా ఆంక్షలు విధించారు. అంతేకాక చంద్రబాబు సెక్రటేరియట్ లోకి ప్రవేశించే గేటు వద్ద కూడా భద్రత మరింత పెరిగింది. ‘టీ న్యూస్’కు నోటీసుల నేపథ్యంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరగొచ్చన్న వార్తల నేపథ్యంలోనే భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News