: ఏపీ డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న టీన్యూస్ జర్నలిస్టుల అరెస్ట్


టీన్యూస్ కు ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేయడంపై ఆ చానల్ లో పనిచేస్తున్న జర్నలిస్టులు ఆందోళన బాట పట్టారు. హైదరాబాదులోని ఏపీ డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. 'టీన్యూస్ పై నీ రుబాబు ఏంటి చంద్రబాబూ?' అంటూ నినదించారు. ఈ నేపథ్యంలో, డీజీపీ కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, ఆందోళన చేస్తున్న జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News