: కేసీఆర్ తో పెట్టుకుంటే మండుతున్న పొయ్యిలో చేయి పెట్టినట్టే: ఎర్రబెల్లికి సీతారాంనాయక్ హెచ్చరిక


టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎవరూ, ఏమీ చేయలేరని ఆ పార్టీ ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పెట్టుకుంటే, మండుతున్న పొయ్యిలో చేయి పెట్టినట్టేనని టీటీడీపీ నేత ఎర్రబెల్లిని హెచ్చరించారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే ధర్మారెడ్డిలపై ఎర్రబెల్లి తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన పైవ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ప్యాకేజీలు మాట్లాడుకున్న నీవు కూడా సిగ్గులేకుండా మాట్లాడుతున్నావా? అంటూ ఎర్రబెల్లిని నిలదీశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు శిక్ష తప్పదని అన్నారు.

  • Loading...

More Telugu News