: సీఎం కేసీఆర్ తో తెలంగాణ డీజీపీ భేటీ... ‘టీ న్యూస్’కు నోటీసులపై చర్చ


తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో ఆ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఏపీ పోలీసులు తెలంగాణ న్యూస్ ఛానల్ ‘టీ న్యూస్’కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నోటీసులపై తెలంగాణ జర్నలిస్టులు భగ్గుమనగా, టీఎస్ ప్రభుత్వం మాత్రం కాస్త ఆచితూచి అడుగులేస్తోంది. ఛానల్ కు నోటీసులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై సీఎం కేసీఆర్ డీజీపీతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఛానల్ కు నోటీసులు జారీ చేసిన ఏపీ సర్కారు, తెలంగాణలోని మరింత మందికి నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయన్న వార్తలపైనా కేసీఆర్ దృష్టి సారించారు.

  • Loading...

More Telugu News