: తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన వర్షం... పలు ప్రాంతాలు జలమయం


ఐదు రోజులుగా కురుస్తున్న వర్షం నేడు తెలుగు రాష్ట్రాల్లో మరింత ఉగ్రరూపం దాల్చింది. రెండు రాష్ట్రాల్లోని మెజారిటీ జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాకినాడ వద్ద మత్స్యకారులకు చెందిన ఓ బోటు గల్లంతైంది. బోటులో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతైంది. వర్షంతో పాటు ఈదురు గాలులు జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. వర్షం కారణంగా ఇరు రాష్ట్రాల్లోని వాగులు, వంకలు పొంగిపొరలుతున్నాయి. పెద్ద సంఖ్యలో చెరువులకు గండ్లు పడ్డాయి. పలు ప్రాంతాల్లో వర్షపు నీటికి రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో పదుల సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.

  • Loading...

More Telugu News