: డ్రంకన్ డ్రైవింగ్ లో మహిళా డాక్టర్...హైదరాబాదు పోలీసులకు చుక్కలు చూపిన వైనం


ఆమె ఓ డాక్టర్. హైదరాబాదులో గైనకాలజిస్ట్ గా పనిచేస్తున్న ఆమె నిన్న రాత్రి నగర పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్న ఆమె బ్రీత్ ఎనలైజర్ పరీక్షలకు సహకరించకుండా పోలీసులకే ఎదురు తిరిగారు. వివరాల్లోకెళితే... వీకెండ్ లలో మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న యువత సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నగర వీధుల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బంజారాహిల్స్ రెడ్ నెం.1 లో కారులో వెళుతున్న వైద్యురాలు అఖిలను పోలీసులు నిలిపారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేేసేందుకు యత్నించారు. అయితే ఆమె అందుకు ఒప్పుకోలేదు. పలువురు పోలీసు ఉన్నతాధికారులు తనకు తెలుసంటూ ఫోన్ తీశారు. ఫోన్ లో మాట్లాడుతూ బ్రీత్ ఎనలైజర్ పరీక్షలకు ససేమిరా అన్నారు. అయితే ఎట్టకేలకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు ఒప్పుకున్న అఖిల పరిమితికి మించి మద్యం సేవించి ఉన్నారని పోలీసులు తేల్చారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కారును సీజ్ చేశారు.

  • Loading...

More Telugu News