: విమానంలోంచి జారి, పడి'పోయాడు'!
దొడ్డిదారిన విదేశాలు చేరేందుకు చాలామంది నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు. కొందరు పడవల్లో దేశాలు దాటేందుకు ప్రయత్నిస్తే, మరి కొందరు విమానాల్లో దేశం దాటాలని ప్రయత్నిస్తుంటారు. ఇలాగే ఓ వ్యక్తి దొంగచాటుగా విమానంలో దేశం దాటాలని ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్ బర్గ్ నుంచి లండన్ వెళ్లే బ్రిటన్ ఎయిర్ వేస్ విమానం వెలుపల రహస్యంగా దాక్కున్న ఓ వ్యక్తి, సుమారు 12 గంటల పాటు 6 వేల కిలో మీటర్ల దూరం ప్రయాణించి గమ్యస్థానం చేరుకునే క్రమంలో, లండన్ హీత్రూ విమానాశ్రయంలో ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ కిందపడి మరణించాడు. అయితే అతను విమానం చక్రాల ప్రాంతంలోనే కూర్చుని ప్రయాణించాడా? లేక ఇంకెక్కడైనా దాక్కున్నాడా? అన్న విషయం తెలియాల్సి ఉంది. ఘటనపై విచారణ చేపట్టారు. తాజా ఘటన విమాన భద్రతపై ఎన్నో అనుమానాలు రేపుతోంది. కాగా, గతంలో విమాన చక్రాల దగ్గర దాక్కుని, దొంగచాటుగా దేశం దాటేందుకు ప్రయత్నించిన వారిని అరెస్ట్ చేసిన సంఘటనలు ఉన్నాయి.