: సాలీళ్లు, కప్పలు, పాముల వర్షాలు కూడా పడ్డాయండోయ్!


తాజాగా కురుస్తున్న వర్షాల్లో చేపలు కురిశాయంటూ కృష్ణా జిల్లా నందిగామ మండలం గోళ్లమూడి, పళగిరి వాసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చేపల వానలు కురవడం మనకు కొత్తగాని ప్రపంచానికి కాదు. చరిత్రను తిరగేస్తే చేపల వర్షాలే కాదు, సాలీళ్ల వాన, కప్పల వాన, పాముల వానలు కూడా కురిశాయట. 1861 ఫిబ్రవరి 22న సింగపూర్ లో తొలిసారి చేపల వాన పడింది. అలాగే 1900 మే 15న నేపాల్, మాదేష్ లో, 1903 జూలై 1న మూన్ జ్వా, సాస్చ్కవాన్ లో, 1947 అక్టోబర్ 23న అమెరికాలోని లూసియానా, మార్క్సవిల్లాల్లో, 2008 ఫిబ్రవరిలో కేరళలో, 2009లో జామ్ నగర్ లో, 2010 ఫిబ్రవరి 25, 26ల్లో ఆస్ట్రేలియా, లజమానుల్లో, 2012లో జనవరి 13న లోరేటో, ఫిలిప్పీన్స్ లో, 2013 సెప్టెంబర్ 12న చెన్నైలో, 2014 మే 6న చిలావ్, శ్రీలంకల్లో, 2014 ఏప్రిల్ 14న ధాయ్ లాండ్ లో పెద్దపెద్ద చేపలు ఆకాశం నుంచి వర్షంలా కురిశాయి. ఇక సాలీళ్ల వానలైతే, 2007 ఏప్రిల్ లో అర్జెంటీనాలో, 2013 ఫిబ్రవరి 3న బ్రెజిల్ లో, 2015 మే 20న న్యూసౌత్ వేల్స్ లో కురిశాయి. ఇక కప్పల వర్షాలు, 2009లో జపాన్ లో కురిస్తే, 2010లో హంగేరీలో కురిశాయి. 1894లో బ్రిటన్ లో జెల్లీ ఫిష్ ల వర్షం కురిసింది. 2007లో అమెరికాలో పాముల్లాంటి పురుగుల వర్షం కురిసింది.

  • Loading...

More Telugu News