: 88 మంది పాక్ జాలర్లను విడుదల చేసిన కేంద్రం


దేశంలోని వివిధ జైళ్లలో ఉన్న 88 మంది పాకిస్థాన్ జాలర్లను భారత ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. వారందరినీ ఈ నెల 21న అట్టారి సరిహద్దు వద్ద పాకిస్థాన్ అధికారులకు అప్పగించనున్నారు. ఈ నెల 18 నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఫోన్ లో ప్రధాని మోదీ రెండు రోజుల ముందుగానే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగానే పాక్ మత్స్యకారులను విడుదల చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే నేడు మత్స్యకారులను విడుదల చేశారు.

  • Loading...

More Telugu News