: బొత్స సవాల్ ను స్వీకరిస్తున్నాం: చీఫ్ విప్ కాల్వ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ చేసిన సవాల్ ను స్వీకరిస్తున్నామని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు తెలిపారు. మంత్రి యనమల రామకృష్ణుడు జగన్ పై చేసిన ఆరోపణలకు తమ వద్ద ఆధారాలున్నాయని చెప్పారు. అంతకుముందు యనమల వేసిన ప్రశ్నలకు కౌంటర్ గా... చంద్రబాబుకు, టీడీపీకి వైసీపీ 23 ప్రశ్నలు సంధించింది. ఇవి వాస్తవమో కాదో చెప్పాలని బొత్స సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే కాల్వ పైవిధంగా స్పందించారు. తమ పార్టీ నేతలు ఆవేదనతోనే గవర్నర్ పై వ్యాఖ్యలు చేశారన్నారు. వాటిని వెనక్కు తీసుకుంటామని చెప్పారు. సీఎం కేసీఆర్ తో కుమ్మక్కు కావల్సిన అవసరంలేదన్నారు.