: రూ.75 పెరిగి... రెండు వారాల గరిష్ఠానికి చేరిన బంగారం ధర
డాలర్ మరింత పతనమవడంతో ఐదు వారాల గరిష్ఠానికి బంగారం ధర చేరింది. దాంతో ఆభరణాల ధరలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలో బంగారం ధర ఈరోజు రూ.75 పెరిగి రెండు వారాల గరిష్ఠానికి చేరింది. దాంతో 10 గ్రాముల బంగారం రేటు బులియన్ మార్కెట్ లో రూ.27,200 పలుకుతోంది. అటు వెండి విలువ కూడా రూ.250 తగ్గడంతో కేజీ ధర రూ.37,050 పలుకుతోంది. ఇక 99.5 స్వచ్ఛత గల పసిడి ధర రూ.27,050కి చేరింది. నగల వ్యాపారులు కొనుగోళ్లు చేపట్టడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావం, డాలరు విలువ పెరుగుతుండటంతో ధరలు పెరిగాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.