: రెహమాన్ ను ఢీకొట్టి నందుకు ధోనీకి ఫైన్


నిన్నటి భారత్, బంగ్లా క్రికెట్ పోరులో 25వ ఓవర్ రెండో బంతికి పరుగు తీసే క్రమంలో బౌలర్ ముస్తాఫిజూర్ రెహమాన్ ను ధోనీ ఢీకొట్టిన సంగతి తెలిసిందే. దీంతో తన కెరీర్ లో తొలి వన్డే ఆడుతున్న ఆ కుర్ర క్రికెటర్ మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఈ ఘటనపై విచారణ జరిపిన ఐసీసీ టీమ్ ధోనీ లెవల్-2 నేరానికి పాల్పడినట్టని అభిప్రాయపడింది. ధోనీ కావాలనే బౌలర్ ను మోచేత్తో గట్టిగా పొడిచాడనే భావనకు వచ్చిన ఐసీసీ మ్యాచ్ ఫీజులో 75 శాతాన్ని ఫైన్ గా విధించింది. కాగా, ఈ కేసులో టీమ్ మేనేజర్ విశ్వరూప్ దేవ్ తో కలసి విచారణకు హాజరైన ధోనీ, తాను తప్పు చేసినట్టు అంగీకరించలేదని తెలిసింది. ఉద్దేశపూర్వకంగా ఆటగాడిని గాయపరచాలని తాను భావించలేదని ధోనీ వాదించినట్టు సమాచారం. ఈ ఉదయం ఆట అంపైర్లు రాడ్ టక్కర్, ఇనాముల్ హక్, ధోనీ, దేవ్, రవిశాస్త్రిలకు ఐసీసీ సమన్లు జారీ చేసి, మొత్తం విషయంపై విచారించింది. అయితే, గాయపడ్డ రెహమాన్ మాత్రం "ఆ సమయంలో నేనో తప్పు చేశాను" అని అంగీకరించినట్టు బంగ్లా పత్రికల్లో వార్తలు వచ్చాయి.

  • Loading...

More Telugu News