: కర్ణాటక, తెలంగాణ జలదోపిడీతో రాయలసీమ నష్టపోతోంది: బైరెడ్డి


కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల జలదోపిడీతో రాయలసీమ ప్రాంతం నష్టపోతోందని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. పట్టిసీమ ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తామనడం విడ్డూరమని ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ నెల 26న జలమండలి కార్యాలయం ఎదుట జలసాధన దీక్ష చేస్తానని బైరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులకు ఆమోదముద్ర పడటానికి పాలకపెద్దలే కారణమన్న ఆయన, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News