: ఓటుకు నోటు వ్యవహారంపై హైకోర్టులో పిల్


ఓటుకు నోటు వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యవహారంలో సీబీఐతో విచారణ జరిపించాలని పీవీ కృష్ణయ్య అనే న్యాయవాది పిల్ దాఖలు చేశాడు. ఈ కేసులో వాస్తవాలు రాబట్టాల్సిన అవసరం ఉన్నందున సీబీచేత న్యాయ విచారణ జరిపించాలని పేర్కొన్నారు. ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టిన ఈ అంశం తీవ్ర రాజకీయ విభేదాలు రేపింది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య దూరం మరింత పెరిగింది. సీఎంలు, మంత్రులు, నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News