: స్మార్ట్ ఫోన్ యూజర్ల సమాచారాన్ని చైనాకు చేరవేస్తున్న ముఖేష్ అంబానీ 'జియో చాట్' యాప్!


ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకాం విడుదల చేసిన చాట్ అప్లికేషన్ 'జియో చాట్'ను వాడుకుంటే యూజర్ల సమస్త సమాచారమూ చైనాలోని సర్వర్లకు, అక్కడి నుంచి చైనా హ్యాకర్లకు చేరిపోతోందట. ఈ విషయాన్ని భారత హ్యాకర్ గ్రూప్ 'అనానిమస్ ఇండియా' వెల్లడించింది. గతంలో టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వెబ్ సైటును ఈ గ్రూపే హ్యాక్ చేసింది. చైనాలోని డెవలపర్లు జియో యాప్ ను అభివృద్ధి చేశారని గుర్తు చేసిన హ్యాకింగ్ గ్రూపు, ఇప్పటికే 5 లక్షలకు పైగా మొబైల్ ఫోన్లకు చెందిన సమాచారం జియో యాప్ చైనాకు చేర్చిందని ఆరోపించింది. కాగా, ఈ ఆరోపణలను రిలయన్స్ జియో కొట్టిపారేసింది. తమ డేటా సెంటర్లన్నీ ఇండియాలోనే ఉన్నాయని, సమాచారం దేశం దాటి వెళ్లే సమస్యే తలెత్తదని తెలిపింది.

  • Loading...

More Telugu News