: జగన్, హరీష్, స్టీఫెన్ ల భేటీకి సంబంధించిన ఆధారాలు చూపండి... రాజకీయాల నుంచి తప్పుకుంటాం: యనమలకు బొత్స సవాల్
ఏపీ ఆర్థిక శాఖ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడుపై వైకాపా నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తమ అధినేత జగన్, టీఎస్ మంత్రి హరీష్ రావు, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ లు భేటీ అయ్యారని అనడాన్ని తప్పుబట్టారు. అంతేకాకుండా, స్టీఫెన్ సన్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని వైకాపా అధినేత జగన్ గతంలో లేఖ రాశారంటూ యనమల వ్యాఖ్యానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఆధారాలు చూపితే తాము రాజకీయాల నుంచి తప్పుకుంటామని అన్నారు. ఏదో ఒక దుష్ప్రచారం చేయడం టీడీపీకి అలవాటుగా మారిందని విమర్శించారు.