: 2 గంటల చార్జింగ్ తో గంట పాటు ఎగిరే చైనా ఎలక్ట్రిక్ విమానం వచ్చేసింది!


'మేడిన్ చైనా' ఎలక్ట్రిక్ విమానాలు వచ్చేశాయి. ప్రపంచంలోనే తొలిసారిగా 230 కిలోల పేలోడ్ ను తీసుకెళ్తూ, 3 వేల మీటర్ల ఎత్తున ప్రయాణించగల ఎలక్ట్రిక్ విమానం 'బీఎక్స్ 1ఈ'ని తయారు చేసినట్టు చైనా అధికార వార్తా సంస్థ క్సిన్హువా తెలిపింది. రెండు గంటల పాటు చార్జింగ్ చేస్తే గంటకు 160 కి.మీ వేగంతో 45 నుంచి గంట పాటు ఈ విమానం ప్రయాణిస్తుందని తెలిపింది. దీన్ని షెన్ యాంగ్ ఏరోస్పేస్ యూనివర్శిటీ, లియోనింగ్ జనరల్ ఏవియేషన్ అకాడమీలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయని వివరించింది. తయారైన తొలి రెండు విమానాలనూ లియోనింగ్ రుయిక్సియాంగ్ జనరల్ ఏవియేషన్ కంపెనీ లిమిటెడ్ కు డెలివరీ చేసినట్టు పేర్కొంది. వీటిని పైలట్ల శిక్షణ, రెస్క్యూ ఆపరేషన్స్, టూరిజం తదితరాల కోసం వాడుకోవచ్చని తెలిపింది. అన్నట్టు దీని ధర 1.63 లక్షల డాలర్లు. మన కరెన్సీలో అయితే, సుమారు ఒక కోటీ నాలుగు లక్షల రూపాయలన్న మాట.

  • Loading...

More Telugu News