: ప్రభాస్ లో టెన్షన్ పెరిగిపోతోందట!
సుమారు రూ. 250 కోట్ల ఖర్చుతో మూడేళ్ల పాటు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఇప్పుడు హీరో ప్రభాస్ ను టెన్షన్ పెడుతోంది. ఇంత భారీ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారోనన్న టెన్షన్ తనలో పెరిగిపోతోందని అంటున్నాడీ యంగ్ రెబల్ స్టార్. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన తాను ఓ రేంజ్ లో టెన్షన్ పడుతున్నానని, ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డానని చెప్పాడు. "ఓ సినిమాలో ద్విపాత్రాభినయం చెయ్యడం చాలా కష్టం, అది కూడా తండ్రీ కొడుకుల పాత్రలయితే ఇంకా కష్టం. బాహుబలి పాత్ర కోసం శరీరాన్ని భారీగా పెంచాల్సి వచ్చింది. ఎంతో కష్టపడ్డాను. తిరిగి సన్నగా మారేందుకు 30 నుంచి 40 రోజుల పాటు ఎలాంటి ఆహారమూ తీసుకోలేదు" అన్నాడు. ఛత్రపతి చిత్రంతో పోలిస్తే బాహుబలి పదివేల రెట్లు పెద్దదని అన్నాడు. కాగా, ఈ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.