: స్టీఫెన్ సన్ కు ఎమ్మెల్యే పదవి ఇమ్మని టీఆర్ఎస్ కు జగన్ లేఖ రాశారు: యనమల


ఓటుకు నోటు కేసులో టీడీపీని, సీఎం చంద్రబాబును ఇరుకున పెడుతున్న టీఆర్ఎస్, వైఎస్ జగన్ లపై మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. చంద్రబాబును అప్రతిష్టపాలు చేయాలనేదే టీఆర్ఎస్, జగన్ ల కుట్ర అని ఆరోపించారు. టీఆర్ఎస్ తో జగన్ కుమ్మక్కై కుట్ర పన్నారన్నారు. గతంలో టీఆర్ఎస్ కు జగన్ ఓ లేఖ రాశారని, స్టీఫెన్ సన్ కు ఎమ్మెల్యే పదవి ఇమ్మని కోరారని మంత్రి యనమల తెలిపారు. జగన్ కు ఆత్మాభిమానం కంటే రాజకీయాలే ముఖ్యమని విమర్శించారు. రేవంత్ రెడ్డి అరెస్టుకు 10 రోజుల ముందే జగన్, హరీష్ రావు, స్టీఫెన్ సన్ లు భేటీ అయ్యారని, రేవంత్ ను ఇరికించేందుకు కుట్ర చేశారని చెప్పారు. తాను చేసిన ఆరోపణలన్నింటికీ పక్కా ఆధారాలున్నాయని సచివాలయంలో మీడియా సమావేశంలో యనమల పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేశామని అందరూ ఒప్పుకుని తరువాత మాట మార్చారన్నారు. ట్యాపింగ్ చేశామని తెలంగాణ హోంమంత్రి చెబితే, ట్యాపింగ్ చేయలేదని తెలంగాణ డీజీపీ చెబుతున్నారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై తమ వద్ద పక్కా ఆధారాలున్నాయన్న మంత్రి, ఫోన్ ట్యాపింగ్ నుంచి కేసీఆర్ ప్రభుత్వం తప్పించుకోలేదని హెచ్చరించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా టీడీపీని ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. విభజన చట్టంలో సెక్షన్-8 అనేది ఓ భాగమన్న మంత్రి, సెక్షన్ 8 అమలు వద్దంటే రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్టేనన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న నేతలు తలోరకంగా మాట్లాతున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News