: ఏపీ మంత్రి నారాయణకు తృటిలో తప్పిన ప్రమాదం
ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. గోదావరి పుష్కరాల పనులను సమీక్షించేందుకు ఆయన రాజమండ్రి వచ్చారు. ఈ ఉదయం నుంచి పనుల పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. పర్యటనలో భాగంగా వై-జంక్షన్ నుంచి ఆయన కాన్వాయ్ వెళుతుండగా, ఓ ఇసుక లారీ అకస్మాత్తుగా కారువైపు దూసుకొచ్చింది. నారాయణ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ముప్పు తప్పింది. దీంతో, మంత్రి నారాయణతో పాటు అందరూ ఊపిరిపీల్చుకున్నారు.