: మా ముగ్గురినీ భరించే నిర్మాత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే లేడు: సల్మాన్


భారత చలనచిత్ర పరిశ్రమలో ముగ్గురు ఖాన్ లనూ భరించే శక్తిగల నిర్మాత లేనేలేడని అంటున్నాడు సల్మాన్ ఖాన్. తనతో పాటు షారూఖ్, అమీర్ లను హీరోలుగా పెట్టి చిత్రాన్ని తీసేవారు ఎవరూ లేరని వ్యాఖ్యానించాడు. "మేము ముగ్గురమూ కలసి ఓ చిత్రంలో నటించాలని ఉంది. కానీ, ఇవాళ ఒక్క ఖాన్ ను భరించే నిర్మాతల సంఖ్యే తక్కువగా ఉంది. ఇక, ముగ్గురినీ తట్టుకునేవారు ఎవరూ లేరు" అని తన తాజా చిత్రం 'బజ్రంగీ భాయీజాన్' చిత్రం ట్రయిలర్ విడుదల సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో సల్మాన్ తెలిపాడు. గత నెలలో అమీర్, షారూఖ్ లు తమ ట్విట్టర్ ఖాతాల్లో 'బజ్రంగీ భాయీజాన్' తొలి పోస్టర్లను ఆవిష్కరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, "వారలా చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా కోసం వారు చేసిన పని ఎంతో నచ్చింది. వారిపై నాకెంతో గౌరవం, ప్రేమ ఉన్నాయి" అన్నాడు. తన చిత్రంపై మరింత ఆసక్తి పెరగడానికి వారు కూడా కారణమేనని సల్మాన్ చెబుతున్నాడు.

  • Loading...

More Telugu News