: సచిన్ వాణిజ్య ప్రకటనలు చేయడంపై పిల్ దాఖలు


మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ పై భోపాల్ కు చెందిన వీకే నస్వహ్ అనే వ్యక్తి మధ్యప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. సచిన్ ఇప్పటికీ పలు టీవీ ప్రకటనలు చేస్తున్నందుకుగానూ తన భారతరత్న పురస్కారాన్ని తిరిగి ఇచ్చేయాలని పిల్ లో కోరాడు. సదరు స్టార్ క్రికెటర్ వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తూ తన గౌరవాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని పిటిషనర్ ఆరోపించాడు. ఈ క్రమంలో ప్రభుత్వం సచిన్ కు ప్రదానం చేసిన అవార్డును వెనక్కు తీసుకోవాలని లేదా అతనే తిరిగిచ్చేయాలని సూచించాడు. ఈ నేపథ్యంలో పిల్ ను విచారించిన కోర్టు, సచిన్ ప్రకటనల్లో కనిపించడానికి సంబంధించి అడ్డుచెప్పే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏమైనా ఉన్నాయేమో పరిశీలించాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ను ఆదేశించింది.

  • Loading...

More Telugu News