: సుబ్రతా రాయ్ కు మరోమారు చుక్కెదురు... బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు


సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్ కి మరోమారు చుక్కెదురైంది. డిపాజిటర్లను మోసం చేసిన కేసులో ఏడాదిగా జైలులో ఉంటున్న సుబ్రతా రాయ్ ఇప్పటికే పలుమార్లు బెయిల్ కోసం యత్నించి విఫలమయ్యారు. తాజాగా ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం తిరస్కరించింది. రూ.10 వేల కోట్ల సొమ్మును డిపాజిట్ చేస్తే బెయిలిస్తామని కోర్టు చెప్పినా నిధుల సేకరణలో సుబ్రతా రాయ్ విఫలమయ్యారు. పరిస్థితిని గమనించిన కోర్టు రూ.10 వేల కోట్ల మొత్తానికి సరిపడ బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చినా బెయిల్ ఇస్తామని ప్రకటించింది. అయితే నేటి విచారణలోగా సుబ్రతో రాయ్ సదరు బ్యాంక్ గ్యారెంటీని కూడా కోర్టుకు సమర్పించలేకపోయారు. దీంతో ఈ దఫా కూడా ఆయన బెయిల్ పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. దీంతో మరింతకాలం పాటు సుబ్రతా రాయ్ జైల్లోనే కాలం వెళ్లదీయక తప్పని పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News