: మండలానికో సర్కారీ వైన్ షాప్... కొత్త మద్యం పాలసీకి ఏపీ సర్కారు కసరత్తు


నూతన మద్యం పాలసీకి కసరత్తు చేస్తున్న ఏపీ ప్రభుత్వం వినూత్న నిర్ణయాలకు తెరతీస్తోంది. మద్యం దుకాణదారుల రింగ్ తో మద్యం ధరలు నిర్దేశిత రేట్ల కంటే అధికంగానే ఉంటున్నాయి. పల్లెలు, పట్టణాలన్న తేడా లేకుండా అన్ని చోట్లా ఇదే దందా. ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంకల్పించారు. ప్రైవేట్ మద్యం దుకాణాలతో పాటు సర్కారీ మద్యం దుకాణాలుంటే ఈ దందాకు చెక్ పెట్టొచ్చని ఆయన భావిస్తున్నారు. అనుకున్నదే తడవుగా ఆయన దీనిని ఆచరణలో పెట్టేస్తున్నారు. ఈ తరహా వినూత్న నిర్ణయాలతో త్వరలోనే ఏపీ నూతన మద్యం పాలసీ విడుదల కానుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో ఓ సర్కారీ మద్యం దుకాణం ఏర్పాటు కానుంది. ఈ కేంద్రం కారణంగా అక్కడి ప్రైవేట్ మద్యం దుకాణదారులు తప్పనిసరిగా నిర్దేశిత ధరలకే మద్యం విక్రయించాల్సి వుంటుంది. పాత మద్యం పాలసీకి ఈ నెల చివరి నాటికి కాలం చెల్లిపోతుంది. తదుపరి నూతన మద్యం పాలసీ జూలై 1 నుంచి అమలులోకి రానుంది.

  • Loading...

More Telugu News