: మినిస్టర్ క్వార్టర్స్ వద్ద బిగ్ ఫైట్... ఏబీవీపీ, పోలీసుల మధ్య తోపులాట


హైదరాబాదులోని మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద కొద్దిసేపటి క్రితం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంతో పాటు కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) విద్యార్థులు ఆందోళనకు దిగారు. అందులో భాగంగా మంత్రుల నివాసాలను ముట్టడించేందుకు విద్యార్థులు యత్నించారు. దీంతో తమను అడ్డుకున్న పోలీసులతో విద్యార్థి సంఘం నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుంది. మరింత మంది పోలీసు బలగాలను రప్పించిన పోలీసు బాసులు విద్యార్థి సంఘం నేతలను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News