: సండ్రకు వైరల్ ఫీవర్ పట్టుకుందట..ఏసీబీ విచారణకు రాలేనంటున్న టీడీపీ ఎమ్మెల్యే
ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీ టీడీపీ నేత, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారట. మూడు రోజుల క్రితం విచారణకు హాజరుకావాలని ఏసీబీ జారీ చేసిన నోటీసుల గడువు నేటి సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. గడువులోగా ఆయన ఏసీబీ అధికారుల ఎదుట హాజరుకావాల్సి ఉంది. అయితే తాను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానని, నిర్ణీత గడువులోగా విచారణకు హాజరుకాలేనని ఆయన ఏసీబీ అధికారులకు సందేశం పంపేందుకు సిద్ధమవుతున్నారు. జ్వరం తగ్గిన తర్వాత విచారణకు హాజరవుతానని, తన అభ్యర్థనను మన్నించాలని ఆయన తన సందేశంలో ఏసీబీని కోరనున్నారు. మరి సండ్ర సందేశంపై ఏసీబీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.