: తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడిగా 'మల్టీ డైమన్షన్' రామ్మోహనరావు


తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడిగా మల్టీ డైమన్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత పి. రామ్మోహనరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు పోటీగా ఇతరులు వేసిన నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో రామ్మోహనరావు ఎన్నిక ఏకగ్రీవమైంది. టీఎస్ ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కోసం ఈ నెల 13 నుంచి 17 వరకూ నామినేషన్లను స్వీకరించారు. సాంకేతిక కారణాలవల్ల పలు నామినేషన్లు తిరస్కరణకి గురయ్యాయి. కాగా, ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడిగా రామ్మోహనరావు రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News