: సండ్ర కాల్ డేటాపై దృష్టి పెట్టిన ఏసీబీ!
ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఏసీబీ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఆ కేసులో సండ్ర ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉంది. సండ్ర విచారణలో మరిన్ని వివరాలు తెలుస్తాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కాల్ డేటాపై వారు దృష్టి పెట్టినట్టు సమాచారం. సండ్రను విచారించిన అనంతరం ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు వెళ్లడం ఖాయమని తెలుస్తోంది. అటు, బుధవారం నాడు టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డిని విచారించిన ఏసీబీ వ్యూహాత్మకంగానే ఆయనను అరెస్టు చేయలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విచారణ సందర్భంగా నరేందర్ రెడ్డిని అరెస్టు చేస్తే సండ్ర విచారణకు హాజరుకాకపోవచ్చని ఏసీబీ సందేహించినట్టు తెలిసింది.