: హైదరాబాదులో అల్లర్లకు అశోక్ బాబు కుట్ర... హెచ్ టీఎన్జీవోస్ ఆరోపణ


ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబుపై హైదరాబాదు టీఎన్జీవో నేతలు నిన్న సంచలన ఆరోపణలు చేశారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాదు నగరంలో అలజడి సృష్టించేందుకు అశోక్ బాబు కుట్ర పన్నుతున్నారని, ఈ క్రమంలో నేడు విజయవాడలో జరగనున్న ఏపీఎన్జీవోల సమావేశం అజెండా కూడా అదేనని హెచ్ టీఎన్జీవో నేతలు సత్యనారాయణ గౌడ్, ప్రభాకర్ రెడ్డి నిన్న ఆరోపించారు. నగరంలో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి సెక్షన్ 8ను అమలు చేయించేందుకు పక్కా పథకంతో కుట్రకు తెరతీస్తున్నారని వారు ఆరోపించారు. తప్పు చేసిన టీడీపీ నేతలకు వంతపాడుతున్న ఏపీఎన్జీవోలు హైదరాబాదులోని సీమాంధ్ర ప్రజలను, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్లాన్ చేస్తున్నారని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News