: భారత్ ను కష్టాల్లోకి నెట్టిన బంగ్లా బౌలర్లు


మిర్పూర్ వన్డేలో 308 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 27 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (63), ధావన్ (30) రాణించడంతో సాఫీగా సాగిపోతున్న టీమిండియా ఇన్నింగ్స్ ను బంగ్లా పేసర్లు రెహ్మాన్, తస్కిన్ అహ్మద్ కుదిపేశారు. చెరో రెండు వికెట్లతో టాపార్డర్ ను దెబ్బతీశారు. కోహ్లీ (1), రహానే (9) తీవ్రంగా నిరాశపరిచారు. ఆపై ధోనీ (5)ని స్పిన్నర్ షకీబ్ అల్ హసన్ అవుట్ చేయడంతో భారత్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో రైనా (12 బ్యాటింగ్), జడేజా (3 బ్యాటింగ్) ఉన్నారు. భారత్ విజయం సాధించాలంటే 23 ఓవర్లలో 175 పరుగులు చేయాలి. చేతిలో మరో ఐదు వికెట్లే ఉన్నాయి.

  • Loading...

More Telugu News