: జయలలిత పథకాన్ని పాక్ టీవీ కొనియాడిందట!
తమిళనాడు సీఎం జయలలిత ప్రవేశపెట్టిన ఓ పథకం పాకిస్థాన్ మీడియా దృష్టిలో పడిందని అన్నాడీఎంకే గర్వంగా చెబుతోంది. రంజాన్ మాసం సందర్భంగా మసీదులకు ఉచితంగా బియ్యం సరఫరా చేయాలని జయలలిత నిర్ణయించారు. ఈ మేరకు ఓ పథకాన్ని ప్రకటించారు. రంజాన్ మాసంలో ఉపవాసం ఉండే వారి కోసం బియ్యంతో ప్రత్యేకమైన జావ తయారు చేస్తారు. అందుకోసం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 3000 మసీదులకు మొత్తం 4,500 టన్నుల బియ్యాన్ని ఉచితంగా అందిస్తారు. అమ్మ ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని కొనియాడుతూ, పాకిస్థాన్ లోని సామా టీవీ చానల్ కథనం రూపొందించి ప్రసారం చేసిందని అన్నాడీఎంకే తెలిపింది. ఈ మేరకు పార్టీ పత్రిక తాజా సంచికలో పేర్కొంది.