: అనగనగా ఓ దీవి... ఐదు దశాబ్దాల తర్వాత అక్కడో చోరీ!


స్కాటిష్ తీరానికి సమీపంలో హెబ్రీడియన్ అనే చిన్న దీవి ఉంది. ఈ చిరుద్వీపం జనాభా వందకు లోపే! ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉండదు. ప్రజలంతా కలసిమెలసి ఉంటారు. కొద్దిమందే కాబట్టి ఎలాంటి సమస్యలు ఉండవు. క్రైమ్ రేటు సున్నా అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ దీవి ఎంత ప్రశాంతంగా ఉంటుందో! అలాంటి ఈ దీవిలో తాజాగా ఓ చోరీ జరిగింది. భారీ దోపిడీ కాకపోయినా, ఐదు దశాబ్దాల తర్వాత జరిగిన చోరీ కావడంతో ప్రజలను విస్మయానికి గురిచేసింది. 60వ దశకంలో అక్కడి చర్చ్ లో ఓ నగిషీలు చెక్కిన ప్లేట్ చోరీకి గురైంది. ఆ తర్వాత మళ్లీ దొంగతనం జరగడం ఇదే ప్రథమం. ప్రజల కోసం ఇక్కడ ఓ స్టోర్ ను ఎల్లవేళలా తెరిచే ఉంచుతారు. ప్రజలు తమకు కావాల్సిన వస్తువులు తీసుకుని, డబ్బులను అక్కడున్న 'నిజాయతీ పెట్టె'లో వేయాలి. ఇప్పటి వరకు సవ్యంగానే జరుగుతూ వచ్చింది. అయితే, తాజా ఘటనలో కొన్ని చాక్లెట్లు, స్వీట్లు, బిస్కెట్లు, చేనేత టోపీలను నగదు చెల్లించకుండానే ఎత్తుకెళ్లారు. దీనిపై షాప్ మేనేజర్ జూలీ మెక్ కేబ్ మాట్లాడుతూ... ఘటనతో ఇక్కడి సమాజం దిగ్భ్రాంతికి గురైందని తెలిపారు. ఇకపై షాపులో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News