: మరోసారి కోటి కోట్లకు చేరువైన ఇన్వెస్టర్ల సంపద


భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంపద మరోసారి కోటి కోట్ల రూపాయలకు చేరువైంది. గడచిన మూడు వారాల్లో మార్కెట్ నష్టం ఫలితంగా లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాపిటలైజేషన్ రూ. 92 లక్షల కోట్లకు పతనమైంది. ఆపై గడచిన నాలుగు సెషన్లలో నమోదైన లాభాలు మార్కెట్ కాప్ ను రూ. 99 లక్షల కోట్లను దాటించాయి. గురువారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ ప్రాథమిక సమాచారం మేరకు కంపెనీల ఈక్విటీ విలువ రూ. 99,44,128 కోట్లుగా ఉంది. కాగా, ఈ సెషన్లో బీఎస్ఈ సూచిక సెన్సెక్స్ 283.17 పాయింట్లు పెరిగి 1.06 శాతం లాభంతో 27,115.83 పాయింట్ల వద్దకు, ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచిక 83.05 పాయింట్లు పెరిగి 1.03 శాతం లాభంతో 8,174.60 పాయింట్ల వద్దకు చేరాయి. రిలయన్స్, లుపిన్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్ తదితర కంపెనీలు లాభపడగా, జడ్ఈఈఎల్, టెక్ మహీంద్రా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్ బీ, కోల్ ఇండియా తదితర కంపెనీలు నష్టపోయాయి.

  • Loading...

More Telugu News