: చంద్రబాబును నిజాయతీపరుడంటే ఎవరూ నమ్మరు: టీఎస్ మంత్రి పోచారం


ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు శిక్ష తప్పదని తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన తప్పు చేశారని, ఇప్పటికైనా తాను చేసిన తప్పును ఒప్పుకోవాలని సూచించారు. చంద్రబాబును నిజాయతీపరుడంటే ఎవరూ నమ్మరని అన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలను కొనేందుకు చంద్రబాబు యత్నించారని... ఎమ్మెల్యేల కొనుగోలుకు టీఆర్ఎస్ ఎన్నడూ యత్నించలేదని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులైన ఎమ్మెల్యేలే స్వతహాగా తమ దగ్గరకు వస్తున్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News