: ఆటో వీడియో ప్లే సౌకర్యంతో సరికొత్త ట్విట్టర్


క్లిక్ చేయకుండానే వీడియోలు వాటంతట అవే ప్లే అవుతుండే సౌకర్యాన్ని ట్విట్టర్ అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ ఆపరేటింగ్ వ్యవస్థల్లో వీడియోలు వాటంతట అవే ప్లే అవుతాయని, జిప్ ఫైళ్లు వాటంతట అవే అన్ జిప్ అయి, అందులోని కంటెంట్ కనిపిస్తుందని ట్విట్టర్ వెల్లడించింది. ఖాతాదారులకు ఈ సౌకర్యం ఉపకరిస్తుందని భావిస్తున్నట్టు పేర్కొంది. ఒకవేళ ఖాతాదారులు ఈ ఆటో ప్లే సౌకర్యం వద్దని భావిస్తే, సెట్టింగ్స్ లోకి వెళ్లి 'నెవర్ ప్లే ఆటోమేటికల్లీ' అనే ఆఫ్షన్‌ ని ఎంచుకోవాలని సూచించింది. కాగా, సామాజిక మాధ్యమాల్లో ట్విట్టర్ కు పోటీగా ఉన్న ఫేస్ బుక్ ఆటో వీడియో ప్లే సౌకర్యాన్ని 2013లోనే ప్రారంభించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News