: నకిలీ సర్టిఫికెట్ తో ఉద్యోగం సంపాదించిన పైలట్ పై ఎయిరిండియా సస్పెన్షన్ వేటు
విద్యార్హతలకు సంబంధించి మోసానికి పాల్పడ్డాడంటూ ఓ పైలట్ ను ఎయిరిండియా సస్పెండ్ చేసింది. ఉద్యోగ నియామకం సందర్భంగా నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ సమర్పించాడని తేలడంతో అతడిపై వేటు వేశారు. అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు. సదరు పైలట్ హెచ్ఎస్ సీ పరీక్షలో ఫెయిలయ్యాడని, బీహార్ లోని ఓ యూనివర్శిటీ పేరిట ఈ నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ తీసుకున్నాడని వివరించారు. కాగా, ఈ విషయంలో ఏవియేషన్ రెగ్యులేటరీ విభాగం, ఎయిరిండియా విచారణ జరిపాయి. పైలట్ పై సస్పెన్షన్ నిర్ణయాన్ని తాము డీజీసీఏకు తెలియజేశామని ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు.