: స్విస్ ఖాతాల్లో తగ్గిన భారతీయుల నిల్వలు


స్విస్ బ్యాంకుల్లో భారతీయులు నిర్వహిస్తున్న ఖాతాల్లో డబ్బు గణనీయంగా తగ్గింది. ఈ విషయాన్ని స్విస్ సెంట్రల్ బ్యాంకు స్వయంగా వెల్లడించింది. భారతీయులు నిర్వహిస్తున్న ఖాతాల్లో 10.6 శాతం మేరకు నగదు నిల్వలు తగ్గాయని ప్రకటించింది. ప్రస్తుతం భారతీయుల ఖాతాల్లో రూ. 12,615 కోట్లు (1.8 బిలియన్ స్విస్ ఫ్రాంకులు) ఉన్నాయని తెలియజేసింది. కాగా, ఇదే సమయంలో స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న ఇతర దేశాల ప్రజల ఖాతాల్లో నగదు నిల్వలు పెరిగాయని సీసీబీ తెలిపింది. తమ బ్యాంకుల్లో విదేశీయులకు చెందిన డబ్బు రూ. 103 లక్షల కోట్లని (సుమారు 1.6 ట్రిలియన్ డాలర్లు) వివరించింది.

  • Loading...

More Telugu News