: బాబు దొరికాడు, కేసీఆర్ దొరకలేదు... ఇద్దరూ దొంగలే: భట్టి విక్రమార్క
ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబునాయుడు, కేసీఆర్ లు ఇద్దరూ దొంగలేనని, చంద్రబాబు దొరికిన దొంగ అయితే, కేసీఆర్ దొరకని దొంగని కాంగ్రెస్ విరుచుకు పడింది. ఆ పార్టీ తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ, వీరిద్దరూ రాజకీయంగా తప్పుపై తప్పు చేస్తున్నారని, ఈ విషయమై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కోట్ల రూపాయలతో ముడిపడివున్నప్పటికీ, విచారణ నత్తనడకన సాగుతోందని ఆయన విమర్శించారు. లక్ష రూపాయల వివాదంలో సీనియర్ నేత బంగారు లక్ష్మణ్ పై వేటు వేసిన బీజేపీ, రూ.5 కోట్ల ఎసిసోడ్ లో మిత్రబృందంలోని బాబును వెనకేసుకొస్తూ వుండడం ఎందుకోసమని ప్రశ్నించారు.