: హైకోర్టులో జెరూసలేం మత్తయ్య పిటిషన్
ఓటుకు నోటు కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధంలేదని తెలిపాడు. కాబట్టి కేసులో తన పేరును కొట్టివేయాలని కోరాడు. మరోవైపు మత్తయ్య నిన్న (బుధవారం) విజయవాడలో పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలంగాణలో పలువురికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.