: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్


మిర్పూర్ లో భారత్ తో జరుగుతున్న తొలి వన్డేలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టేడియం ఉన్న ప్రాంతంలో అడపా దడపా మేఘాలు కనపడుతున్నాయి. ప్రస్తుతానికైతే వర్షం పడే సూచనలు కనిపించడం లేదు. దీంతో, మ్యాచ్ కు అవాంతరాలు లేనట్టే కనపడుతోంది. భారత తుది జట్టులో ధోనీ, ధావన్, రోహిత్, కోహ్లి, రహానే, రైనా, జడేజా, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ ఉన్నారు.

  • Loading...

More Telugu News