: మా ఫోన్లు ట్యాప్ చేయలేదని తేలిస్తే రాజకీయ సన్యాసం... ఎర్రబెల్లి సవాల్
ఓటుకు నోటు కేసులో మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. టీఆర్ఎస్, టీడీపీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుకు సవాల్ విసిరారు. ఓటుకు నోటు వ్యవహారంలో తమ పార్టీ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయలేదని తెలంగాణ ప్రభుత్వం నిరూపిస్తే, తాను రాజకీయాలను నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఆయన స్పష్టం చేశారు. లేని పక్షంలో మీరేం చేస్తారో చెప్పాలని ఆయన టీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు.