: రెండు రోజుల్లో బెజవాడలో చంద్రబాబు నివాసం ఖరారు... మంత్రి నారాయణ వెల్లడి
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి విజయవాడలో తాత్కాలిక నివాసాన్ని రెండు రోజుల్లోగా ఖరారు చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. కొద్దిసేపటి క్రితం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు తాత్కాలిక నివాస భవనం కోసం కృష్ణా కరకట్టలపై ఉన్న భవనాలను పరిశీలించామన్నారు. అయితే ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా తన నివాసం ఉండాలన్న చంద్రబాబు ఆదేశాల కనుగుణంగా చర్యలు చేపడుతున్నామన్నారు. మరో రెండు రోజుల్లోగా చంద్రబాబు తాత్కాలిక నివాస భవనాన్ని ఖరారు చేస్తామని ఆయన ప్రకటించారు. హైదరాబాదులోని ఏపీ ఉద్యోగులందరినీ విజయవాడకు తరలిస్తామని కూడా నారాయణ చెప్పారు. విజయవాడ-గుంటూరు మధ్యనున్న అపార్ట్ మెంట్లను ఉద్యోగులకు కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు.