: నిర్మాత బండ్ల గణేష్ పై చీటింగ్ కేసు
ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ పై చీటింగ్ కేసు, చెక్ బౌన్స్ కేసు నమోదైంది. అంతేగాక ఆయన నిర్మించిన 'నీ జతగా నేనుండాలి' సినిమా వివాదంపై వైకింగ్ మీడియా గణేష్ కు లీగల్ నోటీసు పంపింది. హీరో సచిన్ జోషి ఈ వైకింగ్ మీడియా సంస్థకు డైరెక్టర్. హిందీ చిత్రం 'ఆషికి2'ను తెలుగులో 'నీ జతగా నేనుండాలి' పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అందులో సచిన్, నజియా జంటగా నటించారు. శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై జయ రవీంద్ర దర్శకత్వంలో బండ్ల గణేష్ దీనిని నిర్మించారు. ఈ చిత్రానికి నిర్మాతగా పేరు గణేష్ దే అయినా పెట్టుబడి పెట్టింది హీరో సచిన్ జోషీనే. సినిమా విషయంలో గణేష్ తనను మోసం చేశాడని, డిస్ట్రిబ్యూషన్ డబ్బులు కూడా తిరిగివ్వలేదని వైకింగ్ మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. సినిమా బాగా ఆడినప్పటికీ లాభాల్లో వాటా ఇస్తానని చెప్పి చివరికి నష్టాలు వచ్చాయని గణేష్ తప్పుడు లెక్కలు చూపారని చెప్పినట్టు సమాచారం.