: గోదావరి జిల్లాల పర్యటనకు బయల్దేరిన చంద్రబాబు
గత కొన్ని రోజులుగా ఓటుకు నోటు కేసు వ్యవహారంపై వరుస భేటీలు, ఎత్తుకు పైఎత్తులు వేస్తూ బిజీగా గడిపిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు జిల్లాల పర్యటనకు బయల్దేరారు. కాసేపటి క్రితం హైదరాబాద్ నుంచి ఆయన తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల పర్యటకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై దృష్టి సారించనున్నారు. రాజమండ్రి వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాట్ లను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం, పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులను పరిశీలిస్తారు.