: ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ సీఎస్, డీజీపీ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు నేడు ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా, ఢిల్లీలో నీతి అయోగ్ ఛైర్మన్ తో భేటీ అయి ఏపీకి రావాల్సిన నిధులతో పాటు ఇతర అంశాలపైన కూడా చర్చించనున్నారు. మరోవైపు, ఏపీ డీజీపీ జేవీ రాముడు ఈ సాయంత్రం ఢిల్లీకి బయల్దేరుతారు. కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేస్తున్న సమావేశానికి డీజీపీ హాజరవుతారు. అలాగే రేపు కేంద్ర హోం శాఖ కార్యదర్శితో సీఎస్, డీజీపీలు భేటీ కానున్నారు. ఓటుకు నోటు వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం తరపున తమ వాదన వినిపించనున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే కుట్రలకు పాల్పడుతోందనే అంశాన్ని హోం శాఖ దృష్టికి తీసుకెళ్లనున్నారు. తాజా పరిస్థితులు, ఫోన్ ట్యాపింగ్ అంశంపై చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News