: ఆంధ్ర ప్రజలు తెలివైన వారు: టీఎస్ మంత్రి జగదీష్ రెడ్డి


ఏపీ ప్రజలను తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు. ఆంధ్ర ప్రజలు చాలా తెలివైన వారని... ఓటుకు నోటు కేసుకు సంబంధించి జరుగుతున్న పరిణామాలన్నింటినీ అర్థం చేసుకుంటారని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం మానేసి, తెలంగాణ అభివృద్ధిని కూడా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు అంశంలో ఆయన పాత్ర ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ, తనకు ఇష్టం వచ్చిన విధంగా ఆయన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేయించిందని చంద్రబాబు అంటున్నారని... ఏ ఫోన్ ను ట్యాప్ చేశారో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు శిక్ష తప్పదని అన్నారు.

  • Loading...

More Telugu News