: తెలంగాణ మంత్రులు, అధికారుల పేర్లను చెప్పిన మత్తయ్య...నోటీసుల జారీకి ఏపీ సీఐడీ సన్నాహాలు
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ నోటీసుల జారీ కొనసాగుతుండగా, తాజాగా ఏపీ సీఐడీ నుంచి కూడా నోటీసుల జారీకి నేడో, రేపో తెర లేవనుంది. ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడు జెరూసలెం మత్తయ్య ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఏపీ సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. నిన్న విజయవాడలో పోలీసులకు వాంగ్మూలమిచ్చిన మత్తయ్య, ఈ కేసులో పలువురు తెలంగాణ మంత్రులు, అధికారుల పేర్లను ప్రస్తావించారు. మత్తయ్య వాంగ్మూలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఏపీ సీఐడీ, ఎవరెవరికి నోటీసులు జారీ చేయాలన్న అంశాన్ని పరిశీలిస్తోందని సమాచారం.