: చంద్రబాబు పని అయిపోయినట్లే... కరీంనగర్ లో టీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ వ్యాఖ్య


ఓటుకు నోటు కేసులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులు పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ వివరాలు వెల్లడిస్తే, కేసీఆర్ సర్కారు కూలిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిన్నటి కేబినెట్ భేటీలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యాఖ్యలకు ధీటుగా కేసీఆర్ కూడా నిన్న రాత్రి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఇక చంద్రబాబు పని దాదాపుగా అయిపోయినట్టేనని ఆయన తన పార్టీ నేతలతో సమావేశమైన సందర్భంగా వ్యాఖ్యానించారు. ఏపీ కేబినెట్ భేటీలో సాంతం తనను కేసులో ఎలా ఇరికించాలన్న అంశంపైనే చంద్రబాబు మంతనాలు సాగించారని ఆరోపించిన కేసీఆర్, చివరకు తన యాస, భాషపై వివాదం రేకెత్తించాలని చూస్తున్నారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News