: వైఎస్ దాటని హద్దులనూ దాటేసిన కేసీఆర్: చంద్రబాబు
తనను, తెలుగుదేశం పార్టీని ఇబ్బందిపెట్టే విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హద్దులు దాటారని చంద్రబాబు విమర్శించారు. గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ ఉన్న సమయంలో తనను ఇబ్బందులకు గురి చేసినప్పటికీ, ఎన్నడూ పరిధులు దాటలేదని, కేసీఆర్ మాత్రం ఆయనతో పోలిస్తే మరింత ఘనుడినని అనిపించుకుంటున్నారని బాబు తన సహచర మంత్రుల వద్ద వ్యాఖ్యానించారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని తాను చెబుతున్నా, వినకుండా ఏకపక్షంగా వెళుతున్నారని ఆరోపించారు. తాజా పరిణామాలపై పరిశీలనకు కేంద్రం నుంచి ఓ కమిటీ వస్తే బాగుంటుందని మంత్రులు సూచించగా, దానికింకా సమయముందని బాబు వ్యాఖ్యానించినట్టు సమాచారం.