: పోలీసు బాసులతో మరోమారు చంద్రబాబు భేటీ.. ఫోన్ ట్యాపింగ్ పై కీలక చర్చ


ఓటుకు నోటు వ్యవహారం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులు తమ తమ రాష్ట్రాల పోలీసు బాసులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. తాజాగా మరికాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు తన రాష్ట్రానికి చెందిన డీజీపీ జేవీ రాముడు, ఏసీబీ చీఫ్ మాలకొండయ్య, ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధలతో మారోమారు భేటీ కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఈ భేటీలో చంద్రబాబు కీలక చర్చలు జరపనున్నారు. తమ కాల్ డేటాలు ఎవరికీ ఇవ్వరాదని తెలంగాణ హోం శాఖ కార్యదర్శి ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేశారన్న వార్తల నేపథ్యంలో నేటి చంద్రబాబు భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

  • Loading...

More Telugu News